1. దేవుడు సకల ప్రజల యెదుట సిద్దపరచిన "రక్షణ" ఎవరు?
2. యేసుకు మార్గములను సిద్ధపరచుటకై ఆయనకు ముందుగా వచ్చినదెవరు?
3. జనులలోని ఇశ్రాయేలులో ఎవరు సంతోషముగా సిద్ధపడిరి?
4. పాదములకు దేని వలనైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలబడాలి?
5. దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు సిద్ధపరచినవి ఎలా బయలుపరచియున్నాడు?
6. సిద్ధమనస్సు కలిగి కలిమి కొలదియే ఇచ్చినది ఏమగును?
7. సిద్ధమనస్సుతో దేనిని పైవిచారణ చేయుచు దానిని కాయవలెను?
8. వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణమునడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవరివగునని, దేవుడు ఎవరితో అనెను?
9. తండ్రిచేత ఆశీర్వాదింపబడి, కుడివైపున ఉన్నవారు, వారికి సిద్ధపరచబడిన దేనిని స్వతంత్రించుకొనును?
10. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని, యేసు ఎవరితో అనెను?
11. ఎవరి క్రియల చొప్పున దేవుడు సిద్ధపరచిన ఏది దేవుని యొద్ద నున్నది?
12. ఎవరు వచ్చినప్పుడు సిద్ధపడిన వారు అతనితో పెండ్లివిందుకు పోయిరి?
13. పెండ్లికుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్నది ఏమిటి?
14. పరలోక రాజ్యము కొరకు సిద్ధపాటు సూచించే పరిశుద్ధగ్రంధ పుస్తకమేది?
15. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటను ప్రకటించే పరిశుద్ధగ్రంధ పుస్తకమేది?
Result: