Telugu Bible Quiz Topic wise: 866 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సీయోను" అనే అంశము పై క్విజ్ )

1. "సీయోను" విషయమై యెహోవా ఏమి కలిగియుండెను?
ⓐ కనికరము
ⓑ అధికాసక్తి
ⓒ కటాక్షము
ⓓ అభిలాష
2. యెహోవా "సీయోనును"ఏమి చేయుచుండెను?
ⓐ ఆదరించు
ⓑ ఆవరించు
ⓒ ఓదార్చు
ⓓ నెమ్మదిచ్చు
3. ఏ దేశములో నివాసియైన "సీయోనును" యెహోవా తప్పించుకొని పొమ్మనెను?
ⓐ ఐగుప్తు
ⓑ ఎదోము
ⓒ మోయాబు
ⓓ బబులోను
4. "సీయోను"నివాసుల మధ్య యెహోవా ఏమి చేయును గనుక దానిని ఆయన సంతోషముగా నుండమనెను?
ⓐ నివాసము
ⓑ అద్భుతము
ⓒ ఆశ్చర్యము
ⓓ గొప్పకార్యము
5. మిగుల ఆసక్తితో యెహోవా "సీయోను" విషయమందు ఏమి వహించియుండెను?
ⓐ కోపము
ⓑ రోషము
ⓒ పౌరుషము
ⓓ రౌద్రము
6. ఏ అనుసరించు పురమని "సీయోను" కు పేరు పెట్టబడును?
ⓐ కట్టడ
ⓑ ఆజ్ఞ
ⓒ సత్యము
ⓓ న్యాయము
7. "సీయోను"నివాసులను ఎలా సంతోషించుమని యెహోవా సెలవిచ్చెను?
ⓐ ఎక్కువగా
ⓑ అత్యాసగా
ⓒ అధికముగా
ⓓ బహుగా
8. "సీయోను" యొక్క ఎవరిని యెహోవా రేపుచుండెను?
ⓐ పెద్దలను
ⓑ ప్రధానులను
ⓒ కుమారులను
ⓓ అధిపతులను
9. యెహోవా "సీయోను"కుమారులను ఎవరి మీదికి రేపుచుండెను?
ⓐ తూరీయుల
ⓑ గ్రేకీయుల
ⓒ పారశీకుల
ⓓ ఐగుప్తీయుల
10. "సీయోను"కొండ మీద ఎవరిలో యెహోవా పిలుచువారు కనబడుదురు?
ⓐ ప్రవక్తలలో
ⓑ కాపరులలో
ⓒ శేషించినవారిలో
ⓓ ఉన్నతులలో
11. "సీయోను "కొండ మీద ఎవరు పుట్టినపుడు రాజ్యము యెహోవాది యగును?
ⓐ రాజులు
ⓑ న్యాయాధిపతులు
ⓒ ఏలికలు
ⓓ రక్షకులు
12. "సీయోను"నివాసినిని ఏది బిగ్గరగా చేయుమని యెహోవా చెప్పెను?
ⓐ ఉత్సాహధ్వని
ⓑ గంభీరధ్వని
ⓒ ఆనందధ్వని
ⓓ సంతోషధ్వని
13. యెహోవా "సీయోనులో" నుండి ఏమి చేయుచుండెను?
ⓐ అరచుచుండెను
ⓑ గర్జించుచుండెను
ⓒ కేకలేయుచుండెను
ⓓ పిలుచుచుండెను
14. సువార్త ప్రకటించు "సీయోనును" యెహోవా ఏమి ఎక్కుమనెను?
ⓐ ఎత్తైన కొండ
ⓑ తిన్నని మెట్ట
ⓒ ఉన్నతపర్వతము
ⓓ సూది గట్టు
15. యెహోవా "సీయోను" యొక్క పాడైన వేటన్నిటిని ఆదరించును?
ⓐ భూములను
ⓑ అడవులను
ⓒ మైదానములను
ⓓ స్థలములను
Result: