Telugu Bible Quiz Topic wise: 868 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సూర్యుడు" అనే అంశము పై క్విజ్ )

1. పగటిని ఏలుటకు దేవుడు ఆకాశవిశాలమున దేనిని సృజించెను?
ⓐ పెద్ద జ్యోతిని
ⓑ చిన్నజ్యోతిని
ⓒ నక్షత్రములను
ⓓ ఉల్కలను
2. ఆకాశమున ఉన్న పెద్దజ్యోతిని ఏమంటారు?
ⓐ చంద్రుడు
ⓑ నక్షత్రము
ⓒ సూర్యుడు
ⓓ ఉల్కలు
3. సూర్యుని దేనికి మరుగైనది లేదు?
ⓐ వేడిమికి
ⓑ మంటకు
ⓒ కాంతికి
ⓓ కిరణములకు
4. సూర్యుని క్రింద జరుగు వేటిని మనుష్యులు కనుగొనలేరు?
ⓐ పనులను
ⓑ బాధలను
ⓒ క్రియలను
ⓓ కార్యములను
5. ఎక్కడ దేవుడు సూర్యకాంతి కంటే గొప్ప తేజస్సుతో ప్రకాశించును?
ⓐ పరలోకములో
ⓑ భూలోకములో
ⓒ ఆకాశమందు
ⓓ మండలముపైన
6. సూర్యుని వలన కలుగు శ్రేష్టపదార్ధములు పొందునట్లు యెహోవా ఎవరిని దీవించెను?
ⓐ యోసేపును
ⓑ యాకోబును
ⓒ లేవిని
ⓓ యూదాను
7. సూర్యుడు ఎవరి వలె తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు?
ⓐ వీరుడు
ⓑ శూరుడు
ⓒ ధీరుడు
ⓓ యోధుడు
8. సూర్యుని కన్నులతో చూచుట ఎలా నున్నది?
ⓐ ఇష్టముగా
ⓑ యిచ్చగా
ⓒ ఇంపుగా
ⓓ ఈవిగా
9. ఏది సూర్యకాంతి వలె కనబడును?
ⓐ స్వనీతి
ⓑ సీయోను నీతి
ⓒ యూదానీతి
ⓓ మానవనీతి
10. ఎవరు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు?
ⓐ నీతిమంతులు
ⓑ యధార్థవంతులు
ⓒ యెహోవాను ప్రేమించువారు
ⓓ భాగ్యవంతులు
11. ఉదయింప వద్దని సూర్యునికి దేవుడు ఏమివ్వగా అతడు ఉదయింపడు?
ⓐ నియమము
ⓑ ఆజ్ఞ
ⓒ కట్టడ
ⓓ ఉపదేశము
12. ఆకాశమండలముపై ఏది సూర్యకాంతి ప్రకాశము వలె కనబడుచున్నది?
ⓐ దేవుని మహిమ
ⓑ నక్షత్రములకాంతి
ⓒ ఉల్కల కాంతి
ⓓ చంద్రునికాంతి
13. ప్రభువు నామమందు భయభక్తులు గలవారికి ఎవరు ఉదయించును?
ⓐ వేకువచుక్క
ⓑ తూర్పు నక్షత్రము
ⓒ నీతిసూర్యుడు
ⓓ ప్రకాశమైన చుక్క
14. నీతిసూర్యుడు ఎవరు?
ⓐ యేసుక్రీస్తు
ⓑ మహాదూత
ⓒ ప్రధానదూత
ⓓ పరలోక పెద్ద
15. ప్రభువు ముఖము దేనితో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను?
ⓐ మహా తేజస్సుతో
ⓑ మహా కాంతితో
ⓒ గొప్పవెలుగుతో
ⓓ గొప్పకాంతితో
Result: