1. యెహోవా, నీ మాట చొప్పున నీ "సేవకునికి" నీవు ఏమి చేసియున్నావు?
2. యెహోవా, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి -?
3. ఏ మిగల "సేవకుడు" రాజుల కిష్టుడు?
4. నీవు నా "సేవకుడవు" నీలో నన్ను మహిమపరచుకొనెదనని యెహోవా ఎవరితో చెప్పెను?
5. నీతిమంతుడైన నా "సేవకుడు" వేటిని భరించి తనకున్న దేనిచేత అనేకులను ఎవరిగా చేయును?
6. మన పితరుల దేవుడు తన "సేవకుడైన" ఎవరిని మహిమపరచియున్నాడు?
7. సౌలు కుటుంబమునకు "సేవకుడు"గా ఎవరు ఉండెను?
8. ఏ "సేవకుడు"ను ఇద్దరు యజమానులను,....?
9. యెహోవా "సేవకుడైన" మోషే యెహోవా మాటచొప్పున ఏ దేశములో మృతినొందెను?
10. జనులందరి దృష్టికిని సౌలు "సేవకుల" దృష్టికిని ఎవరు అనుకూలుడైయుండెను?
11. దైవజనుడైన ఎలీషా యొక్క "సేవకుడు"ఎవరు?
12. ఎవరు దావీదునకు కప్పముకట్టు "సేవకులు /దాసులైరి"?
13. దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించుచు రాగా ఎవరి "సేవకులందరి" కంటె అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను?
14. సొలొమోను "సేవకులతో"కూడ సముద్రప్రయాణము చేయనెరిగిన తన దాసులను ఓడలమీద పంపిన రాజు ఎవరు?
15 ఫరో అతని "సేవకులును" ఇంక పాపము చేయుచు తమ హృదయములను ఏమి చేసుకొనిరి?
Result: