1. నీ భార్యలలోను నీ పిల్లలలోను "సౌందర్యము" గలవారు నా వారని బెన్హదదు ఎవరికి వర్తమానము పంపెను?
2. అబ్షాలోము అరికాలు మొదలుకొని తల వరకు ఏమి లేని "సౌందర్యము"గలవాడు?
3. ఎవరు నూలు వేసి చీర్ణముతో గీతగీచి కర్కాటముతో రూపించి నర "సౌందర్యము"గల దానిగా చేయును?
4. సంపూర్ణ " సౌందర్యమును"గల కట్టడముకు మాదిరివి అని యెహోవా ఎవరితో అనెను?
5. యెహోవా అనుగ్రహించిన దేని చేత యెరూషలేము "సౌందర్యము"పరిపూర్ణము ఆయెను?
6. నీ "సౌందర్యమైన" మంద ఎక్కడి నున్నదని యెహోవా ఎవరిని అడిగెను?
7. "సౌందర్యము"గల శ్రేష్టులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను యెహోవా ఎవరి మీదికి రప్పించెదననెను?
8. ఇశ్రాయేలు "సౌందర్యమును" యెహోవా ఎక్కడ నుండి భూమి మీదికి పడవేసెను?
9. పరిపూర్ణ " సౌందర్యము"గల పట్టణము ఏమిటి?
10. ప్రతి అడ్డదోవను బలిపీఠము కట్టి తన "సౌందర్యమును" దేనికి యెరూషలేము వినియోగపరచెను?
11. "సౌందర్యమను"దేనిని యెహోవా తీసుకొని జనులందరితో తాను చేసిన నిబంధన భంగము చేయునట్లు దాని విరిచెను?
12. దేని "సౌందర్యము"అంతయు తొలిగిపోయెను?
13. దేని యొక్క స్వరూప "సౌందర్యము"నశించును?
14. కుమారి "సౌందర్యము"కోరిన రాజైన ప్రభువుకు ఏమి చేయవలెను?
15. దేనికి కలిగినంత "సౌందర్యము" ఇశ్రాయేలుకు కలుగును?
Result: