Telugu Bible Quiz Topic wise: 876 || తెలుగు బైబుల్ క్విజ్ ( "స్తోత్ర గీతములు" అనే అంశముపై క్విజ్ )

① CAROL అనగా అర్ధము ఏమిటి?
Ⓐ ఆనందముతో పాడే పాట
Ⓑ ప్రార్ధన గీతాము
Ⓒ స్తుతికీర్తన;సంతోషగానము
Ⓓ పైవన్నియు
② యెహోవాను గానము చేయుచు ఆయన యొక్క దేనిని కీర్తించెదమని దావీదు అనెను?
Ⓐ శూరకార్యములను
Ⓑ పరాక్రమమును
Ⓒ బాహుబలమును
Ⓓ ఆశ్చర్యములను
③ మనయొక్క దేనిని బట్టి సంతోషగానము చేయుదుమని కీర్తనాకారుడు అనెను?
Ⓐ రక్షణదుర్గమును
Ⓑ ఆశ్రయశైలమును
Ⓒ ప్రాకారమును
Ⓓ కేడెమును
④ మనకు బలమై యున్న దేవునికి ఆనందగానము చేయుడి అని ఎవరు అనెను?
Ⓐ దావీదు
Ⓑ ఆసాపు
Ⓒ సొలొమోను
Ⓓ నాతాను
⑤ ఎలా యెహోవాకు సంతోషగానము చేయుమని కీర్తనాకారుడు అనెను?
Ⓐ ఉత్సాహముతో
Ⓑ ఆర్భాటముతో
Ⓒ బిగ్గరగ
Ⓓ ఉల్లాసముతో
6 యాకోబు దేవుని చేత అభిషక్తుడై ఏమి నొందిన దావీదు స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడు?
Ⓐ రాజాధికారము
Ⓑ యుద్ధవిజయము
Ⓒ మహాపరాక్రమము
Ⓓ మహాధిపత్యము
⑦ యెరూషలేము ప్రతిష్టాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను సంతోషముగా జరిగించుటకు ఎవరిని రప్పించుటకు నెహెమ్యా పూనుకొనెను?
Ⓐ లేవీయులను
Ⓑ యాజకులను
Ⓒ పరిచారకులను
Ⓓ దీర్ఘదర్శులను
⑧ బావీ ఉబుకుము; దాని కీర్తించుడి అని ఇశ్రాయేలీయులు యెహోవా నీళ్లనిచ్చెదననిన ఏ బావి యొద్ద పాట పాడిరి?
Ⓐ పెలయేరు
Ⓑ నారు
Ⓒ బెయేరు
Ⓓ యెషేరు
⑨ ఏ రాజు మీద యెహోవా విజయము ఇచ్చిన తర్వాత దెబోరా బారాకు కీర్తన పాడిరి?
Ⓐ ఎదోము
Ⓑ కనాను
Ⓒ మోయాబు
Ⓓ అమోరీయ
①⓪. యెహోవా ప్రజల యెదుట పర్వతములు మెట్టలను సంగీతగానము చేయునని ఎవరు అనెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యోవేలు
Ⓒ హిజ్కియా
Ⓓ యెషయా
①① ఏ రాజు కాలములో యాజకులు బూరలు ఊదువారును పాటకులును ఏకస్వరముతో యెహోవాకు గానము చేసిరి?
Ⓐ దావీదు
Ⓑ హిజ్కియా
Ⓒ సొలొమోను
Ⓓ యెహోషాపాతు
①② దావీదును ఇశ్రాయేలీయులందరును తమ యొక్క దేనితో దేవుని సన్నిధిని పాటలు పాడిరి?
Ⓐ పూర్ణశక్తితో
Ⓑ పూర్ణస్వరముతో
Ⓒ గంభీరకంఠముతో
Ⓓ బిగ్గర గొంతుతో
①③ ఎక్కడికి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించునప్పుడు మన నాలుక ఆనందగానముతో నిండియుండెనని కీర్తనాకారుడు అనెను?
Ⓐ షోమ్రోనుకు
Ⓑ తిర్సాకు
Ⓒ సీయోనుకు
Ⓓ సీనాయికి
①④ దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది ఏమైయున్నదని కీర్తనాకారుడు అనెను?
Ⓐ అద్భుతము
Ⓑ మనోహరము
Ⓒ ఆశ్చర్యము
Ⓓ ఆనందము
①⑤ స్తోత్ర గీతములు పాటల విషయములలో ఎవరు ప్రధానుడు?
Ⓐ హేమాను
Ⓑ యెదుతూను
Ⓒ ఏతాను
Ⓓ ఆసాపు
Result: