1: ఎవరు దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను?
2Q. ఎప్పటికి దావీదుతో స్నేహముగా ఎవరుండెను?
3Q. యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలురాజైన ఎవరితో స్నేహము చేసెను?
4Q. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ఈవాక్యం యొక్క రిఫరెన్స్ తెలపండి?
5Q. ఈ లోకముతో స్నేహము చేయగోరు వాడు ఎవరికి శత్రువగును?
6. దేవుని స్నేహితుడని ఎవరికి పేరు కలిగెను?
7Q. ఎవరు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి(పేతురు) కొరకు కని పెట్టుకొని యుండెను?
8Q. ఏమి గలవానికి స్నేహితులు అధికముగానుందురు?
9Q.నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు ఏది నాకు బంధువర్గమాయెను?
10 Q. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన, వానికి దేనిగా ఎంచబడును?
11. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా ఎవరితో ముఖాముఖిగా మాటలాడుచుండెను?
12Q. ఏమి కోరి స్నేహితుడు గాయములు చేయును?
13. ఎవరు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను?
14: ఎవరు యిహలోకమును స్నేహించి, పౌలును విడిచి థెస్సలొనీకకు వెళ్లెను?
15Q. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో ఏమి ఆడవలెననియు కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను?
Result: