①. రాత్రి కలుగు "స్వప్నము"లో గోతికి పోకుండా నరులను కాపాడుటకు దేవుడు దేనిని సిద్ధపరచును?
②. విస్తారమైన వేటి వలన "స్వప్నము"పుట్టును?
③. రాత్రివేళ దేవుడు "స్వప్నమందు" ఎవరి యొద్దకు వచ్చి శారా నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను?
④. రాత్రి "స్వప్నమందు దేవుడు లాబాను నొద్దకు వచ్చి ఎవరి విషయములో జాగ్రత్త సుమీ అని చెప్పెను?
⑤. ఎక్కడ యెహోవా రాత్రివేళ "స్వప్నమందు"సొలొమోనుకు ప్రత్యక్షమాయెను?
⑥. అధికమైన "స్వప్నములు" ఎటువంటివి?
⑦. ప్రభువు దూత ఎవరికి "స్వప్నమందు" ప్రత్యక్షమై దావీదు కుమారుడని అనెను?
⑧. ఎవరి యొద్దకు వెళ్లవద్దని జ్ఞానులకు "స్వప్నమందు" దేవునిచేత బోధింపబడెను?
⑨. ప్రభువు దూత హేరోదు చనిపోయిన తరువాత యోసేపునకు ఎక్కడ "స్వప్నమందు"ప్రత్యక్షమాయెను?
①⓪. మరల యోసేపు "స్వప్నమందు" బోధింపబడినవాడై ఏ ప్రాంతములకు వెళ్ళెను?
①①. నీవు "స్వప్నము"వలన నన్ను ఏమి చేసెదవని యోబు యెహోవాతో అనెను?
①②. తనకు కలిగిన "స్వప్నము"లో సొలొమోను దేవునిని ఏమి అడిగెను?
①③. యెహోవా యొద్ద ఎవరు విచారణ చేయగా "స్వప్నము"ద్వారా నైనను యెహోవా ఏమియు అతనికి సెలవియ్యలేదు?
①④. యెహోవా నన్ను ఎడబాసి "స్వప్నము" ద్వారా నైనను నాకేమియు సెలవియ్యలేదని సౌలు ఎవరితో అనెను?
①⑤. ఎవరి "స్వప్న"భావము దానియేలు తెలియపరచెను?
Result: