1. యెహోవా అగ్నిలో సీనాయి కొండమీద తన కంఠస్వరముతో ఎవరి యెదుట మాట్లాడెను?
2. యెహోవా స్వరము ఎక్కడ ఉరుమువలె వినబడుచున్నది?
3. యెహోవా స్వరము ఏ వృక్షములను విరచును?
4. యెహోవా స్వరము విని భయపడి దాగినదెవరు?
5. యెహోవా స్వరము వేటిని రాల్చును?
6. యెహోవా స్వరము వేటిని ప్రజ్వలింపజేయును?
7. యెహోవా కంఠస్వరము యోహానుకు ఎలా విన్పించెను?
8. యెహోవా స్వరము దేనిని కదిలించును?
9. యెహోవా ఉదయమున ఏ కంఠస్వరముతో మాటలాడును?
10. రెండు కెరూబుల నడుమ నుండి మాటలాడిన యెహోవా స్వరము ఎవరు వినెను?
11. చక్కగా నిలువుమని యెహోవా స్వరము ఎవరితో అనెను?
12. ఆకాశమున ప్రకాశమైన వెలుగు నుండి ప్రభువు తన స్వరముతో ఎవరితో మాట్లాడెను?
13. యెహోవా స్వరము లెబానోను వృక్ష ముక్కలను దేనివలె గంతులు వేయునట్లు చేయును?
14 . వేటి కదలిక విస్తారఉదకముల ఘోష వలె నుండు దేవుని స్వరము వలె నుండెను?
15. యెహోవా స్వరము ఎటువంటిది?
Result: