1. నీవు ఈ దేశమును (కనాను)"స్వతంత్రించుకొనునట్లు" ఎవరి ఊరినుండి నిన్ను తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని యెహోవా అబ్రాహాముతో అనెను?
2. నీవు వాగ్దానము చేసిన దేశములోనికి ప్రవేశించి దానిని "స్వతంత్రించుకొనునట్లు"నీ ప్రజలను రప్పించితివని ఎవరు యెహోవాతో అనెను?
3. మైదానమందుండువారు ఎవరి దేశమును "స్వతంత్రించు"కొందురని యెహోవా అనెను?
4. నా నామము ధరించిన ఎవరిని నా జనులు "స్వతంత్రించు"కొనునట్లు పడిపోయిన దావీదు గుడారమును కట్టుదునని యెహోవా అనెను?
5. ఇశ్రాయేలీయుల దండు సారెపతు వరకు ఎవరి దేశమును "స్వతంత్రించు"కొందురని యెహోవా అనెను?
6. ఎవరు ఘనతను "స్వతంత్రించు"కొందురు?
7. యెరూషలేములో చెరపట్టబడి దేనికి పోయిన వారు దక్షిణదేశపు పట్టణములను "స్వతంత్రించు" కొందురని యెహోవా అనెను?
8. సత్యము మిమ్మును "స్వతంత్రులుగా"చేయునని యేసు తనను నమ్మిన ఎవరితో అనెను?
9. స్వాతంత్య్ర ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవువారికి తగినట్టుగా మాటలాడి అలాగుననే ఏమి చేయుమని యాకోబు అనెను?
10. ప్రభువు నందు పిలువబడిన ఎవరు ప్రభువు వలన "స్వాతంత్ర్యము"పొందినవాడు?
11. ప్రభువు యొక్క ఏమి యెక్కడ యుండునో అక్కడ"స్వాతంత్య్రము "యుండును?
12. దేవుడిచ్చిన "స్వాతంత్య్రము"వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుమని పౌల ఏ సంఘముతో అనెను?
13. "స్వతంత్రులై "యుండియు దేనిని కప్పిపెట్టుటకు ఆ "స్వాతంత్య్రమును"వినియోగపరచవద్దని పేతురు అనెను?
14. వేటిని చేయువారు దేవుని రాజ్యమును "స్వతంత్రించు "కొనరు?
15. దీనులు భూమిని "స్వతంత్రించు" కొందురని ఎవరు అనెను?
Result: