Telugu Bible Quiz Topic wise: 887 || తెలుగు బైబుల్ క్విజ్ ( "స్వాస్థ్యము" అనే అంశము పై క్విజ్)

1. "స్వాస్థ్యము" అనగా ఏమిటి?
ⓐ సంపద
ⓑ వారసత్వము
ⓒ స్వంతసొత్తు
ⓓ పైవన్నీ
2. అబ్రాహాము సంతతికి ఏదేశమును "నిత్యస్వాస్థ్యముగా "ఇచ్చెదనని దేవుడు చెప్పెను?
ⓐ కనాను
ⓑ బేతేలు
ⓒ సిరియ
ⓓ ఈజిప్టు
3. యెహోవాయే ఎవరికి "స్వాస్థ్యము"?
ⓐ ప్రజలకు
ⓑ యాజకులకు
ⓒ లేవీయులకు
ⓓ అన్నిగోత్రములకు
4. ఎవరు యెహోవా అనుగ్రహించు "స్వాస్థ్యము"?
ⓐ కుమార్తెలు
ⓑ కుమారులు
ⓒ సోదరులు
ⓓ సోదరిలు
5. ధర్మశాస్త్రము ఎవరి సమాజ "స్వాస్థ్యము"?
ⓐ మోషే
ⓑ యాకోబు
ⓒ అహరోను
ⓓ యెహోషువా
6. గృహమును, విత్తమును ఎవరు ఇచ్చిన "స్వాస్థ్యము"?
ⓐ పితరులు
ⓑ తల్లి
ⓒ తండ్రి
ⓓ నాయకులు
7. ఎటువంటి "స్వాస్థ్యము"దేవుడు అనుగ్రహించును?
ⓐ పితరుల
ⓑ శ్రేష్టమైన
ⓒ వారసత్వ
ⓓ అన్యజనుల
8. ఎవరి గోత్రములో స్త్రీ సంతానమునకు "స్వాస్థ్యము" కలిగెను?
ⓐ లేవి
ⓑ రూబేను
ⓒ మనషే
ⓓ యూదా
9. యెహోవావే నా "స్వాస్థ్యభాగము" అని ఆనినదెవరు?
ⓐ యాకోబు
ⓑ గాదు
ⓒ నాతాను
ⓓ దావీదు
10. జీవముతో కూడిన నిరీక్షణ వలన మనకు ఎటువంటి "స్వాస్థ్యము"లభించును?
ⓐ అక్షయమైన
ⓑ వాడబారని
ⓒ నిర్మలమైన
ⓓ పైవన్నియు
11. పరిశుద్ధులలో దేవుని "స్వాస్థ్యము" యొక్క మహాత్మ్యమును ఎరుగుటకు మనకు ఏమి వెలిగింపబడెను?
ⓐ నయనములు
ⓑ మనోనేత్రములు
ⓒ హృదయము
ⓓ మనస్సు
12. విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడుబడు మనకు "పరలోకస్వాస్థ్యము"ఏమి చేయబడి యున్నది?
ⓐ సిద్ధము
ⓑ దాచబడి
ⓒ భద్రము
ⓓ కట్టబడి
13. తేజోవాసులైన పరిశుద్ధుల "స్వాస్థ్యము"లో పాలివారమగుటకు దేవుడు మనలను ఎలా చేసెను?
ⓐ పాత్రులుగా
ⓑ సహాయకులుగా
ⓒ దాసులుగా
ⓓ పనివారిగా
14. ప్రభువు పనిని ఎలా చేసిన "పరలోకస్వాస్థ్యము" ను దేవుడు మనకు ప్రతిఫలముగా ఇచ్చును?
ⓐ నీతిగా
ⓑ యధార్ధముగా
ⓒ మనస్ఫూర్తిగా
ⓓ మంచిగా
15. తండ్రి తన సంకల్పమును బట్టి మన కొరకు ఎవరిని "స్వాస్థ్యముగా"ఇచ్చెను?
ⓐ యేసుక్రీస్తును
ⓑ ఈవులను
ⓒ కృపావరములను
ⓓ ప్రవక్తలను
Result: