1Q. "స్వేచ్ఛ"గా నాలుకల నాడించుకొనుచు వేటిని ప్రకటించు ప్రవక్తలకు యెహోవా ఎలాంటివాడు?
2Q. ఎవరు బొబ్బలు పెట్టునది, "స్వేచ్ఛ"గా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు?
3Q. యెహోవా, నా నోటి "స్వేచ్ఛా"ర్పణలను అంగీకరించుము, వేటిని నాకు బోధింపుము అని దావీదు భక్తుడు దేవుడిని అడుగుచుండెను?
4Q. యెహోవాకు "స్వేచ్ఛా"ర్పణమైన దహనబలి నైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు ఎటువైపు గుమ్మము తీయవలెను?
5Q. అడవి గాడిదను "స్వేచ్ఛ"గా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ ?
6 Q. యెహోవాకు దహన బలిగా "స్వేచ్ఛా "ర్పణములనైనను మ్రొక్కు బళ్లనైనను అర్పిం చునొ వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱమేకలలో నుండియైనను దేనిని అర్పింప వలెను?
7. ఏది బలవంతముచేతనైనట్టు కాక "స్వేచ్ఛా" పూర్వకమైనదిగా ఉండవలెను?
8Q. యెహోవాకు "స్వేచ్ఛా"ర్పణమైన దహనబలి నైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు ఎటువైపు గుమ్మము తీయవలెను?
9Q. "స్వేచ్ఛా"పరుడును కాక ఎవరు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను?
10 Q. శిక్షలో ఉంచ బడినవారిని తీర్పు దినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు ఎటువంటి వాడు. వీరు తెగువగలవారును "స్వేచ్ఛా"పరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు?
11: యెహోవా కానుకలను అతిపరిశుద్ధమైన వాటిని పంచి పెట్టుటకు దేవునికి అర్పింపబడిన "స్వేచ్ఛార్పణల"మీద ఎవరు నియమింపబడెను?
12Q. కోపమువచ్చి మనుష్యులను చంపి, తమ "స్వేచ్ఛ"చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిన సహోదరులు ఎవరు?
13: నీ దేవుడైన యెహోవాకు ఏ పండగ ఆచరించుటకై నీ చేతనైనంత "స్వేచ్ఛా"ర్పణమును సిద్ధపరచవలెను?
14 Q. కుటుంబ ప్రధానులు కొందరు ఏ దేశములో ఉండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను "స్వేచ్ఛా"ర్పణములుగా అర్పించిరి?
15: "స్వేచ్ఛ "చేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట బాగుచేయింపవలెనని ఎవరు ఆజ్ఞ ఇచ్చెను?
Result: