Telugu Bible Quiz Matthew Part: 44 || మత్తయి సువార్త పై క్విజ్ || Matthew Telugu Bible Quiz

1/10
1.యేసయ్య తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని తన శిష్యులకు ----- గా ఆజ్ఞాపించెను?
A. కోపముగా
B. ఖండితముగా
C. ధైర్యముగా
D. ఆనందముగా
2/10
2.తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసయ్య ఎవరికి తెలియజేయ మొదలు పెట్టెను?
A. జనులకు
B. తన శిష్యులకు
C. శాస్త్రులకు
D. పరిసయ్యులకు
3/10
3.పేతురు యేసయ్య చేయి పట్టుకొనిప్రభువా, అది నీకు దూర మగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను -------?
A. గద్దింపసాగెను
B. ఒప్పింపసాగెను
C. బలపరచసాగెను
D. ప్రేమించసాగెను
4/10
4.సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమై యున్నావు; అని యేసయ్య ఎవరి వైపు తిరిగి చెప్పెను?
A. జనుల వైపు
B. పేతురు వైపు
C. యోహాను వైపు
D. యాకోబు వైపు
5/10
5.నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని యేసయ్య ఎవరితో చెప్పెను?
A. పేతురుతో
B. యోహానుతో
C. యాకోబుతో
D. తోమాతో
6/10
6.ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. అని యేసయ్య ఎవరిని చూచి చెప్పెను?
A. జనులను
B. తన శిష్యులను
C. శాస్త్రులను
D. పరిసయ్యులను
7/10
7.తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. అని అన్నది ఎవరు?
A. పేతురు
B. యోహాను
C. యాకోబు
D. యేసయ్య
8/10
8. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు? అని అన్నది ఎవరు?
A. జనులు
B. శిష్యులు
C. యేసయ్య
D. పరిసయ్యులు
9/10
9. మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ------ ఇచ్చును?
A. బలమిచ్చును
B. అధికారమిచ్చును
C. ఫలమిచ్చును
D. ధనమిచ్చును
10/10
10.ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు ------ రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను?
A. భయము
B. ధైర్యము
C. సహాయము
D. మరణము
Result: