TELUGU BIBLE QUIZ ON 1st SAMUEL #11

1➤ సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము ----------- చేయక యుండెను?

2➤ సౌలు భోజన మేమియు చేయక యుండి నందున ------- ఆయెను?

3➤ నీవు భోజనము చేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుమని సౌలుతో అన్నది ఎవరు?

4➤ ఫిలిస్తీయులు దండెత్తి పోయి ఎక్కడ దిగియుండిరి?

5➤ ఇశ్రాయేలీయులు యెఱ్ఱయేలులోని –--------- దగ్గర దిగియుండిరి?

6➤ ఫిలిస్తీయుల సర్దారులు తమ సైన్యమును నూరేసిమంది గాను వెయ్యేసిమందిగాను –---------- పరచి వచ్చుచుచుండిరి?

7➤ దావీదును అతని జనులును ఎవరితో కలిసి దండు వెనుకతట్టున వచ్చుచుండిరి?

8➤ "ఈ హెబ్రీయులు ఏల రావలెను" అని ఫిలిస్తీయుల సర్దారులు ఎవరినడిగెను?

9➤ సౌలు వేలకొలదిగాను దావీదు పదివేలకొలదిగాను హతముచేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని ఆకీషుతో చెప్పింది ఎవరు?

10➤ యెహోవా జీవము తోడు నీవు నిజముగా యధార్థపరుడవై యున్నావు; దండులో నీవు నాతోకూడ సంచరించుట నా దృష్టికి అనుకూలమే; అని ఎవరు ఎవరితో అనెను?

11➤ ఆకీషు దావీదుతో నీవు నాయొద్దకు వచ్చిన దినము నుండి నేటివరకు నీయందు ఏ దోషమును నాకు కనబడలేదుగాని --- నీయందు ఇష్టములేక యున్నారనెను?

12➤ ఆకీషు దావీదుతో ఫిలిస్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతి కూలమైన దాని చేయ కుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు ------- గా వెళ్లుమని చెప్పెను?

13➤ నీయొద్దకు వచ్చిన దినము నుండి నేటివరకు నీ దాసుడనైన నాయందు తప్పేమి కనబడెనని దావీదు ఎవరనడిగెను?

14➤ దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును అని దావీదుతో అన్నది ఎవరు?

15➤ దావీదు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని ఆకీషుతో చెప్పింది ఎవరు?

16➤ ఆకీషు దావీదుతో ఉదయమున నీవును నీతోకూడ వచ్చిన నీ యజమానుని సేవకులును -------- గా లేవవలెననెను?

17➤ ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని ఆకీషు దావీదునకు ---------– ఇచ్చెను?

18➤ దావీదును అతని జనులును ఉదయమున త్వరగా లేచి ------------- దేశమునకు పోవలెనని ప్రయాణమైరి?

19➤ దావీదును అతని జనులును ఎన్నవ దిన మందు సిక్లగునకు వచ్చిరి?

20➤ అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని------------ ?

21➤ దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది ------------అయియుండుట చూచిరి?

22➤ దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడి యుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును ----------- లోనికి కొనిపోబడి యుండుట చూచిరి?

23➤ దావీదును అతని జనులును ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత –--------- గా ఏడ్చిరి?

24➤ దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి---------- ?

25➤ తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరి ప్రాణము ---------—?

26➤ జనులందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి ఎవరిని చంపుదము రండని చెప్పుకొనిరి?

27➤ దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి --------- తెచ్చుకొనెను?

28➤ దావీదు --------తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పెను?

29➤ అబ్యాతారు ఏఫోదును ఎవరి నొద్దకు తీసికొనివచ్చెను?

30➤ నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని దావీదు ఎవరి యొద్ద విచారణ చేసెను?

31➤ దేవుడు దావీదుతో నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని --------- అని సెలవిచ్చెను?

32➤ దావీదు అతనియొద్దనున్న ఆరువందల మందియును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో ఎంత మంది వెనుక దిగవిడువబడిరి?

33➤ ఆ రెండువందల మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక------------ ?

34➤ ఆ నాలుగు వందలమంది పోవుచుండగా పొలములో వారికి ఎవరు కనబడెను?

35➤ వారు ఆ ఐగుప్తీయున్ని ఎవరి యొద్దకు తోడుకొని వచ్చిరి?

36➤ ఆ ఐగుప్తీయుడు మూడు రాత్రింబగళ్లు ---------– పుచ్చు కొనలేదని తెలిసికొనిరి?

37➤ ఆ ఐగుప్తీయునికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు —------ గెలలను వానికిచ్చిరి?

38➤ వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము ---------—?

39➤ నీవు ఏ దేశపువాడవు? ఎక్కడ నుండి వచ్చితివని ఆ ఐగుప్తీయున్ని అడిగింది ఎవరు?

40➤ ఆ ఐగుప్తీయుడు దావీదుతో నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి ---------- నైతిననెను?

41➤ ఆ ఐగుప్తీయుడు దావీదుతో - మూడు దినముల క్రిందట నేను కాయిలాపడగా నా యజమానుడు నన్ను -------?

42➤ మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని దావీదుతో చెప్పింది ఎవరు?

43➤ ఆ దండును కలిసికొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని ఆ ఐగుప్తీయున్ని అడిగింది ఎవరు?

44➤ ఆ ఐగుప్తీయుడు దావీదుతో నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ---------- చేసిన యెడల ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవచూపుదుననెను?

45➤ ఫిలిస్తీయుల దేశములోనుండియు యూదా దేశములోనుండియు తాముదోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, ఆ దండువారు ఆ ప్రదేశమంతట చెదిరి -------------పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి?

46➤ దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని ------------- చేయుచుండెను??

47➤ దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు –-------- లను రక్షించెను?

48➤ కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువ కాకుండ దావీదు సమస్తమును ---------?

49➤ దావీదు అమాలేకీయుల గొర్రేలన్నిటిని గొడ్లన్నిటిని -----------—?

50➤ అవి దావీదునకు –------------- సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వాటిని తోలిరి?

51➤ అలసటచేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన వారు ఎంత మంది?

52➤ దావీదు ఆ జనులయొద్దకు వచ్చి వారి---------- అడిగెను?

53➤ దావీదుతో కూడ వెళ్లినవారిలో దుర్మార్గులును, పనికి మాలినవారునైన కొందరు వీరు మనతోకూడ రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన --------లో వీరికియ్యమనిరి?

54➤ యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని అన్నది ఎవరు?

55➤ నాట నుండి నేటివరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను ------ గాను ఏర్పరచి నియమించెను?

56➤ దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన --------- పెద్దలకు ఏర్పరచెను?

57➤ దావీదు తన స్నేహితులైన యూదా పెద్దలతో . యెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత —------ గా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను?

58➤ దావీదును అతని జనులును సంచరించిన స్థలములన్నిటిలోను ఉన్న -------- లకు దావీదు దోపుడు సొమ్ములో కొంత పంపించెను?

59➤ ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల యెదుట నుండి —-----------?

60➤ గిల్బోవ పర్వతమువరకు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను --------------చేయుచు వచ్చిరి?

61➤ సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలు యొక్క కుమారులను హతము చేసింది ఎవరు?

62➤ యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారిచేత -------- నొందెను?

63➤ నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని సౌలు ఎవరితో అనెను?

64➤ ఆయుధములను మోయువాడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని —----------?

65➤ సౌలు మరణమాయెనని అతని ఆయుధములను మోయు వాడు తానును తన కత్తిమీద పడి అతనితో కూడ ---------—?

66➤ లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులును, మొర్దాను అవతల నున్నవారును, ఇశ్రాయేలీయులు పారి పోవుటయు, సౌలును అతని కుమారులును చచ్చియుండుటయు చూచి తమ --------- విడిచిపెట్టి పారిపోయిరి?

67➤ ఫిలిస్తీయులు హతమైనవారిని దోచుకొన వచ్చి ---------------- పర్వతము మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొనిరి?

68➤ సౌలు తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోను ------------- తెలియజేయుటకై ఫిలిషీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి?

69➤ ఫిలిస్తీయులు సౌలు ఆయుధములను ------ గుడిలో ఉంచిరి?

70➤ వారి శల్యములను తీసి యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతిపెట్టి ఎన్ని దినములు ఉపవాసముండిరి?

Your score is